పొన్నలపల్లె చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ

 

 

 

 

 

 

హాజరైన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు
వివిధ గ్రామాల సర్పంచులు హాజరు..

గంభీరావుపేట ఫిబ్రవరి 19(జనం సాక్షి):

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో నూతనంగా గురువారం రోజు చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నూతన సర్పంచ్ పొన్నాల మహేష్, రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షులు, బొప్పా దేవయ్య, బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి వివిధ గ్రామాల సర్పంచ్ల చేతి మీదగా పూల మాలలు వేసి విగ్రహ ఆవిష్కరించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్ని అంకితం చేసినటువంటి చత్రపతి శివాజీ మొగల్ సామ్రాజ్యం యొక్క రాజులకు వ్యతిరేకంగా హిందూ ఔన్నత్యాన్ని పెంచే క్రమంలో తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వీరుడు సూరడు చత్రపతి శివాజీ అని ఆయన విగ్రహాన్ని పొన్నాల పల్లెలో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ధర్మాన్ని రక్షించే ఒక యోధుడు చత్రపతి శివాజీ అని కొనియాడారు, సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరు సహకారం ఉండాలని పొన్నాలపల్లి చిన్న గ్రామమైన ఐక్యంగా ఉంటామని దీనికి అందరి సహకారం ఉంచాలని కోరారు,ఈ కార్యక్రమంలో జాతీయ రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు బొప్పా దేవయ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ పెట్టి కూర సురేష్, బిజెపి జిల్లా అధ్యక్షులు, రెడ్డబోయిన గోపి, ఎంపీడీవో రాజేందర్ ఏపీవో అరుణ, మాజీ జెడ్పిటిసి మల్లు గారి నర్సా గౌడ్, మునురు కాపు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం మల్లయ్య,దమ్మన్నపేట సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మాజీ మండల అధ్యక్షులు నంది కిషన్,
పెద్ద బోనాల మున్నూరు కాపు అధ్యక్షులు తోట శంకర్, వివిధ గ్రామాల ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు మండల ప్రజలు బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్ మండల నాయకులు పొన్నాలపల్లి గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు