కాంగ్రెస్ గెలుపుతోనే పట్టణ అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి షరీఫా బేగం మొహమ్మద్ ఖాజా
చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 05 : గత బీఆర్ఎస్ పరిపాలనలో చేర్యాల పట్టణాన్ని అస్తవ్యస్తం చేసి బీఆర్ఎస్ నాయకులు నాశనం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే చేర్యాల పట్టణం అభివృద్ధి చెందుతుందని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షరీఫా బేగం ఖాజా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కాంగ్రెస్ శ్రేణులు కాలనీ ప్రజలతో కలిసి గడపగడపకు తిరుగుతూ తమను గెలిపించాలని ఓటర్లను కోరారు. చేర్యాల అంగడి బజార్ లో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ నాయకులు కూల్చివేసి పట్టణ ప్రజలకు అందుబాటులో లేకుండా తీరని అన్యాయం చేశారన్నారు. ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు ఎన్నో ఏండ్లుగా ఉన్న పశువుల అంగడిని అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కి వత్తాసు పలికి కట్టబెట్టి కబ్జా చేశారని అన్నారు. చికెన్ మటన్, కూరగాయలు చిరు వ్యాపారుల షేటర్లను తొలగించి వారి ఉపాధిని పూర్తిగా దెబ్బతీసి అన్యాయం చేసి అస్తవ్యస్తంగా మార్చిన బీఆర్ఎస్ పాలకుల విధానాలు పట్టణ ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు నిరసనగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ద్వారానే చేర్యాల పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టణాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారు. నీతి నిజాయితీగా ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని తమను ఆశీర్వదించి ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనిగారి బిక్షపతి, శనిగారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.


