చదువుతో పాటు విలువలు, సంస్కారం ముఖ్యం

బోయిన్ పేట్ 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి
మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ బోయిన్ పేట్ లోని ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ బహుత్ కిషోర్ లోకే రాజ్ పవన్, AAP చైర్ పర్సన్ అట్టెం సుధా ఆధ్వర్యంలో నూతనంగా కౌన్సిలర్ గా గెలుపొందిన పోతరవేని శ్రీలతక్రాంతి ని విద్యార్థుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ శ్రీలతక్రాంతి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతో పాటు సంస్కారం విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్ కలిగివుండాలని తెలిపి ప్రతి విద్యార్థి పుట్టిన రోజు తమ స్వంత ఖర్చులతో జరుపుతాము అని పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు


