అందరి సౌకర్యార్థం నీటి వసతి

 

 

 

 

 

 

కిషన్ గంజ్ లో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13:(జనం సాక్షి)

గ్రామీణులు, కూలీల సౌకర్యార్థం నీటి వసతిని కల్పించడం సంతోషకరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ది కిషన్ గంజ్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం గంజ్ లో వాటర్ ట్యాంక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కిషన్గంజ్ కు జిల్లా వ్యాప్తంగా అనేకమంది నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తుంటారన్నారు. వేసవిలో వారి సౌకర్యార్థం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అలాగే వ్యాపార కేంద్రాల్లో అనేక మంది కూలీలు పనిచేస్తుంటారని, వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొందర్లోనే కిషన్ గంజిలో సీసీ రోడ్డు వేయించేల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందూరు అభివృద్ధి తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, మర్చంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కోలా రామ్, అధ్యక్షుడు నేతి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అనంపల్లి చందు, కోశాధికారి వినోద్, హమాలీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు