ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలి.

తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీపా నర్సింలు..
నియామక పత్రం అందజేసిన పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు ఫిబ్రవరి 26(జనంసాక్షి) ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలకు నిరాతనం పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు గురువారం తాండూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా దీప నర్సింహులుకు పైలెట్ రోహిత్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ హయాంలో లో జరిగిన సంక్షేమం అబివృద్ది పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని వెల్లడించారు. ఫ్లోర్ లీడర్ గా నియామకమైన దీప నర్సింహులుకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నూతన కౌన్సిలర్లు నాగలక్ష్మి అనంత్ రెడ్డి, బి అనిల్ కుమార్, ఎండి ఇర్షాద్, ఎండి జావిద్, పట్లోళ్ల దీప నర్సింలు, సురేష్ నాయక్, నవీన సంతోష్ గౌడ్, నసీరాబాను (ఎజాజ్), అవుసుల యోగానంద్, మహేశ్వరి, సుప్రీత కరుణాకర్ పాటిల్, రూప రుద్రు పాటిల్ తదితరులు ఉన్నారు.



