వ్యాపార వాణిజ్య పరంగా భూపాలపల్లిని మరింత అభివృద్ధి చేస్తాం

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని, ఇది జిల్లా కేంద్రంగానే ఉంటుందని, ఈ జిల్లాను వ్యాపార, వాణిజ్యపరంగా ఇంకా అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకువచ్చామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందని, రేషన్ కార్డు ద్వారా పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్కటిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ భూపాలపల్లికి ఏటీసీ సెంటర్, నర్సింగ్ కాలేజీ మంజూరు చేయించడం జరిగిందని, మంత్రులు వచ్చిఅభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేస్తే, ఉత్తుత్త రాళ్లు అంటూ కొంతమంది నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రారంభించిన పనులు రెండేళ్లలో పూర్తి చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగమని సవాల్ విసిరారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో జంక్షన్ల అభివృద్ధి, నాలుగు లైన్ల రోడ్డు, తదితర అభివృద్ధి పనులను చేపట్టి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, సిపిఐ, సిపిఎం నాయకులు కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


