35వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం

మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి.
తాండూరు ఫిబ్రవరి 26(జనంసాక్షి)35వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని
మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం తాండూరు పట్టణం మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ నీరజబాల్ రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ నీరజబాల్ రెడ్డి వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి మాలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. 35 వార్డ్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మున్సిపల్ అధికారులు వార్డు ప్రజలు పెద్దలు పాల్గొన్నారు.



