అభివృద్ధి పథంలో 13వ వార్డును ముందుకు తీసుకెళ్తా

 

 

 

 

 

 

 

 

వార్డులో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి.
13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చిన కౌన్సిలర్.
సొంత డబ్బులతో వార్డులో రెండు బోరు బావులు .
తాండూరు ఫిబ్రవరి 26(జనంసాక్షి) వార్డులో ప్రజా సమస్యలపై 13వ అవార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ముందు వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని 13వ వార్డు పరిధి పాన్ మాల్ కాలనీలో కౌన్సిలర్ సురేష్ నాయక్ తన సొంత డబ్బులతో రెండు బోర్లను వేయించి హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ సురేష్ నాయక్ మాట్లాడుతూ వార్డు సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి మరియు స్థానిక వార్డు నేతల అందరి సహకారంతో వార్డులో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వార్డు అభివృద్ధే ధ్యేయంగా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వార్డును అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అబ్రార్ లాల, స్థానిక వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.