మహిళలు సమస్యల సాధన కోసం పోరాడాలి
మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి
బచ్చన్నపేట ( జనం సాక్షి): మహిళలలు మహిళల సమస్యల సాధన కోసం నిరంతరం పోరాటం చేయాలని జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అన్నరు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగామలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వివక్షతలేని సమాజం రూపొందాలని, అన్నారు.టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ, మహిళాభ్యున్నతే సమాజ అభివృద్ధికి మూలమని, కాబట్టి మహిళలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగాలని అన్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేసిన 75 మంది మహిళలకు సన్మానం చేశారు. బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ రజిత శ్రీనువాస్ సన్మానం చేశారు. జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఆమె తన వంతు సహకారం అందిస్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు.ఈకార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రావు, మదూరి వెంకటేష్, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస రావు, జిల్లా కార్యదర్శులు కృష్ణ, శ్రీనివాస్ కృష్ణ మూర్తి, మహిళా విభాగం నాయకులు గూడ లలిత. హిమబిందు, రోజా, మమత, నర్సమ్మ, కవిత, ఎలిజబెత్, మాధవి, నిరంజని, లతో పాటు వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు


