మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి పార్థివదేహానీకి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

 

 

 

 

 

 

 

 

 

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని రాంరెడ్డి కాంప్లెక్స్ తీసుకువచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి పార్థివదేహాన్నీ గురువారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాంరెడ్డి గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.