అధికారులపై దాడికి ఖండన

share on facebook

శ్రీకాకుళం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మండల ప్రజా పరిషత్‌, మెళియాపుట్టి అధికారులపై దాడులను ఖండిస్తూ..’ సోమవారం ఉదయం మెలియాపుట్టి మండలానికి సంబంధించిన పంచాయతీ సెక్రెటరీలు, ఎంపీడీవో పడాల చంద్రకుమారి, ఇఓ ఆర్‌డి. రమేష్‌ ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మెలియాపుట్టి మండలంలోని వసుంధర గ్రామానికి చెందిన కదంబాల సుధాకర్‌ అనే వ్యక్తి వసుంధర పంచాయతీకి సంబంధించిన సెక్రెటరీ మనోహర్‌ పై చేయి చేసుకోవడాన్ని ఖండించారు. అధికారులపై దుర్భాషలాడితే ఊరుకునేది లేదని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ర్యాలీ అనంతరం మెలియాపుట్టి తహసీల్దార్‌ దామోదరానికి వినతిపత్రాన్ని అందజేశారు. తద్వారా తమకు న్యాయం చేయాలని కోరారు.

Other News

Comments are closed.