ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

share on facebook

హైదరాబాద్‌,నవంబర్‌8 (జనంసాక్షి) : ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని,వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సవిూక్ష నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ భూముల లీజ్‌ రెంట్లు, భూ రికార్డుల ప్రక్షాళన, ఆలయ భూముల వేలం పక్రియలో పారదర్శకత, తదితర అంశాలపై మంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. ఆలయ భూముల వ్వహారంలో దేవాదాయ శాఖ అధికారులు కూడా అలసత్వం విడనాడాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, అదనపు కమిషనర్‌ శ్రీనివాస రావు, డిప్యూటీ కమిషనర్లు, తదితరులు హాజరయ్యారు.

Other News

Comments are closed.