ఆత్మీయ అలాయ్‌..బలాయ్‌..

c
– పులకించిన జలవిహార్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌23(జనంసాక్షి): నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్‌లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  సందడిగా సాగిన కార్యక్రమంలో  కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కేంద్రమంత్రి దత్తాత్రేయ కళాకారులతో కలిసి సందడి చేశారు.  పలువురు కేంద్రమంత్రులు అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ ,కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్శింహారెడ్డి. ఈటల రాజేందర్‌, సీఎల్పీ నేత జానారెడ్డి, టిడిపి నేతలు రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్‌, ఎంపీ జితేందర్‌రెడ్డి, సినీనటులు రాజేందప్రసాద్‌, వేణుమాధవ్‌, జీవిత కిషన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, టీటీడీపీ రేవంత్‌, ఎర్రబెల్లి, టీఆర్‌ఎస్‌ నేతలు జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, నటుడు అలీ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ పలువురు ప్రముఖులను సన్మానించారు.అలయ్‌ బలయ్‌ అంటే ఆత్మీయ ఆలింగనం అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా అన్నారు. ఏ విషయాన్నైనా మనసుతోనే గెలవాలన్నారు.  తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అమరావతి శంకుస్థాపనలో భాగంగా తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులిద్దరూ చేతులు కలపడం శుభపరిణామనన్నారు. సమర్థులైన ఇద్దరు ముఖ్యమంత్రులూ రాష్టాల్రను అభివృద్ధి బాట పట్టిస్తారని అన్నారు. రెండు తెలుగు రాష్టాల్ల్రో  ప్రస్తుతం ఉల్లాసపూరిత వాతావరణం ఉందని దత్తాత్రేయ తెలిపారు. ఇద్దరు చంద్రులు కలవడం నూతన శకానికి నాంది అని చంద్రబాబు, కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రుల కలయిక ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిందని ఆయన చెప్పారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ప్రధానమంత్రి మోదీ సందేశం పంపించారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ఐక్యతకు చిహ్నమన్నారు. దత్తాత్రేయ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందించారు.

అలయ్‌బలయ్‌ అద్భుతమైన కార్యక్రమం

అలయ్‌బలయ్‌ అద్భుతమైన కార్యక్రమమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.  అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అందరిలో సోదరభావం పెంపొందించే కార్యక్రమమే అలయ్‌ బలయ్‌ అన్నారు. దత్తాత్రేయ సామాన్య ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి అని కొనియాడారు. అన్ని పార్టీల వారితో స్నేహపూర్వకంగా మెలగడం దత్తాత్రేయకే చెల్లిందన్నారు.అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఇరు రాష్టాల్ర ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోవడం శుభపరిణామమన్నారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకురాగలిగే ఏకైక వ్యక్తి దత్తాత్రేయ మాత్రమే అన్నారు. సామాన్యులకు చేరువగా ఉండడమే గాకుండా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకునిరాగలిగిన వ్యక్తి అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధం అదృష్టమన్నారు. కార్మికుల కనీస పింఛను రూ.వెయ్యి చేసిన ఘనత దత్తాత్రేయదేనన్నారు.  దత్తాత్రేయ లాంటి వ్యక్తి నాకు సహచరుడిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచే వ్యక్తి దత్తాత్రేయ. అందరం ఒక్కటేనన్న తత్వాన్ని అలయ్‌-బలయ్‌ కలిగిస్తుందన్నారు.