మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా

31అక్టోబర్ జనంసాక్షి :-రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులను కేటాయించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ప్రభుత్వ సలహాదారుడిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించారు.
ఆరు గ్యారంటీల అమలు బాధ్యతను సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. వీటిపై జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన సమన్వయం కానున్నారు. ఇక అన్ని కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయనకు ప్రవేశం కల్పించారు. ఈ మేరకు మంత్రులకు ఉండే సదుపాయాలన్నీ సుదర్శన్ రెడ్డికి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సచివాలయంలో ఆయనకు మంత్రి స్థాయి వసతులు అందనున్నాయి.
 
             
              


