ఇద్దరు ఎంపిలను గెలిపించుకోవాలి: ఎమ్మెల్యే

share on facebook

గద్వాల,మార్చి28(జ‌నంసాక్షి): ఉమమడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.
పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చేలా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరో పదిరోజుల పాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని గ్రామస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సూచించారు.సీఎం కేసీఆర్‌ చేపడుతున్న ప్రజా సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలదే నన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే దుష్పచ్రారాలను తిప్పి కొట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎంపీలుగా
గెలిపించుకుంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి జరుగబోయే ప్రయోజనాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పాలన్నారు.  కష్టపడి ఎంపీ అభ్యర్థులను గెలిపించుకున్నట్లయితే మరో ఐదేండ్ల వరకు రాష్ట్రానికి కావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 16 ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటే కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Other News

Comments are closed.