ఈనామ్‌కు వ్యాపారుల పంగనామాలు

share on facebook

మార్కెట్లో రైతుల సమస్యలకు మళ్లీ ఆజ్యం
హైదరాబాద్‌,మే15(జ‌నంసాక్షి):ల్గ/తులు పండించిన పంటలను ప్రభుత్వమే మద్దతుధరలకు కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో డబ్బులు చెల్లించేలా ఈనామ్‌ విధానాన్ని  కేంద్రం ప్రవేశపెట్టినా ఈ యేడు ఎక్కడా పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇటీవల కందులు,మిర్చి కొనుగోళ్ల ప్రహసనమే దీనికి కారణంగా చెప్పుకోవాలి. దళారుల బెడద లేకుండా రైతులకు నాణ్యతనుబట్టి మద్దతు ధరలు లభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. మొదటగా సోయా, మినుము ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావడంతో కొనుగోళ్లన్నీ పారదర్శకంగా నిర్వహించేందుకు,కొనుగోళ్లు సాఫీగా సాగేందుకు సంబంధిత శాఖ సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఈ సేవలు అందనంత దూరంలో ఉండటంతో రైతులు పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవస్థలు పడ్డారు. కంప్యూటర్లు మొరాయించడం, నెట్‌ పనిచేయకపోవడం తదితర కారణాల వల్ల రైతులు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు అపసోపాలు పడేవారు. ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినా అవి నామమాత్రంగానే అమలయ్యాయి. మార్కెట్‌ యార్డుల్లో ప్రైవేటు వ్యాపారులు, కవిూషన్‌ ఏజెంట్లు, దళారులు అధికార యంత్రాంగంతో కుమ్మక్కయి తమ ఇష్టారీతిన కొనుగోళ్లు చేపడుతూ రైతును నట్టేటా ముంచకుండా చూడాలన్న సంకల్పాన్ని దళారులు మళ్లీ దెబ్బతీసారు. సకాలంలో కొనుగోళ్లు చేయడంతో పాటు ఏరోజుకారోజు ధరలు ప్రకటిస్తూ కొనుగోళ్లు చేయాలి.  రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి. ఎంతో పారదర్శకంగా ఉంటుందనుకున్న ఈనామ్‌ విధానం ఆదిలోనే  విఫలమయ్యేలా చేశారు.  సాంకేతిక లోపం పేరిట అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. దీంతో చేసేదేవిూ లేక మళ్లీ ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరలకే రైతులు మినుము, సోయా పంటలను అమ్ముకోవాల్సి వచ్చింది. మార్కెట్‌  డిమాండ్‌ మేరకు ఎప్పటికప్పుడు నెట్‌ ద్వారా ధరలు నిర్ణయించి కొనుగోళ్లు చేపట్టాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈనామ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం వల్ల రైతులకు దళారులు, కవిూషన్‌ ఏజెంట్ల బెడద తొలగి ఎప్పటికప్పుడు ధరలు తెలియడంతో పాటు అమ్ముకున్న పంటలకు నేరుగా ఖాతాల్లో డబ్బులు జమయ్యే వీలు కల్పించింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశించారు.  సాంకేతిక లోపం పేరిట అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. దీంతో చేసేదేవిూ లేక మళ్లీ ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరలకే రైతులు మినుము, సోయా పంటలను అమ్ముకోవాల్సి వచ్చింది. పత్తి, సోయా, వరి, మొక్కజొన్న, పసుపు, మిర్చి, కంది ప్రధాన పంటలు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు మార్కెట్‌ యార్డులున్నాయి. ఆయా మార్కెట్లలో  ఈ విధానంతో రైతులకు ప్రయోజనం చేకూరే వీలు కలిగింది. అయినా  కొనుగోళ్ల తతంగమంతా ప్రైవేటు వ్యాపారులు, కవిూషన్‌ ఏజెంట్లు, దళారుల కనుసన్నల్లోనే సాగాయి. మార్కెటింగ్‌ శాఖ అధికార యంత్రంగం వారితో కుమ్మకై ఈనామ్‌ విధానానికి పంగనామం పెట్టారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

Other News

Comments are closed.