భారీగా తరలివచ్చిన భక్తులు
జగిత్యాల,మే25 జనంసాక్షి : మాల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కొండగట్టుకు భక్తులు భారీగా పోటెత్తారు. పుష్కరణిలో పుణ్య స్నానాలు ఆచరించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో కొండగట్టు కాషాయమయమయింది. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్.. జై హనుమాన్ నినాదాలు, నామస్మరణతో మారుమోగుతున్నాయి. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వాములు మాల విరమణ చేస్తున్నారు. అయితే కొండగట్టు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని అంటున్నారు. బస్సుల దగ్గర నుంచి పుష్కరిణిలో స్నానాల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు భక్తులు. ప్రభుత్వం కొండగట్టును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కొండగట్టులో ఘనంగా హనుమత్ జయంతి
Other News
- అగ్నిపధ్ అనే పథకాన్ని దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే తగినట్టుగా ఉంది : ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి మిద్దెల జితేందర్
- దేశ రక్షణ, సైనికుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- నిరుపయోగంగా దౌల్తాబాద్ ప్రయాణ ప్రాంగణం.
- 15వ వార్డులో పడిపోయిన ఇంటిని శుభ్రం చేయించిన కౌన్సిలర్
- మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
- *రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*
- పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు ...సారు
- కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి... * వర్ధంతి సభలో జూలకంటి..
- మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్.....