గ్రామప్రణాళిక పక్కాగా అమలు కావాలి

share on facebook

గ్రామాల్లో కార్యక్రమాలపై కలెక్టర్‌ ఆరా
సర్పంచ్‌లదే కీలక భూమిక అన్న కలెక్టర్‌
నిధుల కొరత ఉండబోదని హావిూ
జనగామ,సెప్టెంబర్‌11( జనంసాక్షి ) : ముప్పై రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో అభివృద్ధిని  సాధించుకోవాలని జనగామ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమం 6న ప్రారంభం కాగా ఆయన గ్రామాల వారీగా జరుగుతన్న కార్యక్రమాలపై ఆరా తీస్తున్నారు. గ్రామంలో 30 రోజుల ప్రణాళిక పూర్తయి తర్వాత నిధులు రావని భయపడొద్దని, 14 ఫైనాన్స్‌ కింద నిధులు వస్తాయని సర్పంచ్‌, గ్రామస్తులకు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా కలిసి సమస్వయంతో పనిచేస్తేనే నిర్ధేశిరచుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు.  గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఏలా అమలువుతుందని అడిగితెలుసుకున్నారు. ప్రణాళికలో భాగంగా ఖాళీ స్థలాల్లో చెట్లు పొదలు ఉంటే రెండు రోజుల్లో శ్రమదానం చేయించి తొలగించాలన్నారు. ఈసందర్భంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు అందజేయాలని ఈజీఎస్‌ సిబ్బందికి ఆదేశించారు. దీంతో దోమలను అరికట్టే తులసి, కృష్ణ తులసి మొక్కలు ఉండేలా చూసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. డంపింగ్‌యార్డును తప్పకుండా వినియోగించు కోవాలన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచ్‌కు పలు విశిష్ట అధికారులు, విలువలు కల్పించారనని, కావున గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని తెలిపారు. మన ప్లలెలను మనమే ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చిందని, దానిని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన
సూచించారు. గ్రామసమస్యల పరిష్కరానికి ప్రభుత్వం గ్రామజనాభా నిష్పత్తి ప్రకారం నిధులను విడుదల చేసిందని తెలిపారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయడం, హరితహారం మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవడం, గ్రామాల్లోని విద్యుత్‌ దీపాలకు సంబంధించిన మరమ్మతు పనులు త్వరతిగతిన పూర్తిచేయాలని తెలిపారు. కావున ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లు సహకరించాలని అన్నారు. ఈ 30 రోజుల ప్రణాళికలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాల రూపురేఖలు మార్చేందుకు గ్రామ ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రజలు కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకకు ముందుకురావాలని, అప్పుడే గ్రామం అన్ని రంగాల్లో ముందుంటుందన్నారు. గ్రామాలకు ఎవరో వచ్చి బాగు చేస్తారని చూడకుండా మనమే కలసి బాగుచేసుకుంటే బాగుంటుందన్నారు. ప్రతీ వార్డులో ఆ వార్డు ప్రజలు ముందుకువచ్చి చెత్తచేదారం లేకుండా చేసుకుంటే దోమలు, ఈగలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నారు.

Other News

Comments are closed.