తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు

share on facebook

 

హైదరాబాద్‌,నవంబరు 26(జనంసాక్షి): తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 41,101 పరీక్షలు నిర్వహించగా 862 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకినవారి సంఖ్య 2,66,904కి పెరిగింది. తాజాగా కరోనా మహమ్మారితో ముగ్గురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,444కి చేరింది. ఈ మేరకు గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా 961 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,54,676కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 164 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది.

 

Other News

Comments are closed.