ఐపీఎస్ అధికారుల బదిలీ
20 మందిని స్థానచలనం చేస్తూ సీఎస్ ఉత్తర్వులు
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గజారావు భూపాల్ (ఐజీ), అభిషేక్ మొహంతి (విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీ), భాస్కరన్ (ఇంటెలిజెన్స్ డీఐజీ), చందనా దీప్తి (ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అదనపు సీపీ), టి. అన్నపూర్ణ (అడ్మిన్, సైబరాబాద్ డీసీపీ), రాహుల్ హెగ్డే (హైదరాబాద్ సిటీ ట్రాఫిక్`3 డీసీపీ), అపూర్వారావు (ఇంటెలిజెన్స్ ఎస్పీ), బి.బాలస్వామి (విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ), వెంకటేశ్వర్లు (సీఐడీ ఎస్పీ)అవినాష్ కుమార్ (క్రైమ్స్, డీసీపీ)గా బదిలీ అయ్యారు.


