సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు

షాద్ నగర్ : సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హనణానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ షాద్ నగర్ డిసిపి సి.శిరీష అన్నారు. సోమవారం నాడు జనంసాక్షి దినపత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల నుండి మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో వ్యక్తుల వ్యక్తిత్వా హననానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించారు. నేటి యువత సెల్ ఫోన్ సోషల్ మీడియా భారీన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని మొబైల్ ను మంచి కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని, యువత డ్రగ్స్, మద్యానికి, గంజాయికి దూరంగా ఉండాలని వాటిపై గట్టి నిఘా పెట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు చదువుకొని భవిష్యత్తులో తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలని సూచించారు. ఎవరికి ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్న డేల్ 100 కు కాల్ చేయాలని ప్రజలకు దగ్గరగా పోలీసులు ఉంటారని అన్నారు.


