పోలీస్‌ అధికారులను అభినందించిన హూం మంత్రి

share on facebook

హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లలో అత్యుత్తమమైన 10 పోలీస్‌ స్టేషన్లను ఎంపిక చేస్తారు. ఆయా పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ, ప్రజాభిప్రాయం వంటి అంశాల ప్రాతిపదికన ఎంపిక చేసిన 10 పోలీస్ట్సేషన్లలో తెలంగాణ రాష్ట్రం నుంచి జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌ కూడా ఎంపికైంది. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కు చెందిన జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర హూంశాఖ మంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ హర్షం వ్యక్తం చేశారు. 2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పది పోలీస్ట్సేషన్లలో తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్‌ ఎంపిక కావడం పై పోలీస్‌ అధికారులను హూం మంత్రి అభినందించారు. రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి ని, కరీంనగర్‌ కమిషనర్‌ కమల్‌ హాసన్‌ రెడ్డి ని, జమ్మికుంట పోలీస్‌ సిబ్బందిని హూంమంత్రి ప్రశంసించారు .కాగా, వరుసగా రెరడవసారి కరీం నగర్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌ గా నిలిచింది. ఉత్తమ పౌర సేవలు పోలీసింగ్‌ అమలుకు గాను 2019 సంవత్సరం లో కరీంనగర్‌ కు చెందిన చొప్పదండి పోలీస్‌ స్టేషన్‌ ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌ ఎంపికైన విషయం విధితమే. వీటిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని ఇతర పోలీస్‌ స్టేషన్లో అధికారులు ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌ లు గా ఎంపిక అయ్యేందుకు కషి చేయాలని హూంమంత్రి సూచించారు.

Other News

Comments are closed.