బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి

share on facebook


గద్వాల ఆర్.సి (జనంసాక్షి) ఆగస్ట్ 4,

జోగులాంబ గద్వాల జిల్లాలోనీ
తహసిల్దార్ కార్యాలయం ముందు తెలుగు రాష్ట్రాల్లో బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు రాజు రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో పార్టీలకు అతీతంగా కెసిఆర్
నరేంద్రమోడీ,రాజీవ్ గాంధీ బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి విస్మరించడం జరిగింది అన్నారు.రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రేవంత్ రెడ్డి ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఎల్లప్పుడూ ప్రజల కోసం తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.అదే విధంగా బోయ వాల్మీకి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బైండింగ్ రాములు మాట్లాడుతూ బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చెంతవరకు పోరాటం అంచలంచలుగా చేస్తామన్నారు. గద్వాల కేటి దొడ్డి, గట్టు మండలాల్లో ధర్నాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వీరుబాబు
వివిధ పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొనడం జరిగింది.

Other News

Comments are closed.