భూ సమస్యలకు తక్షణ పరిష్కారం: ఆర్డీవో

share on facebook

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): రై తాంగ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఎంతగానో దోహదపడిందన్నారు. పంట పెట్టుబడి సహాయం, రైతుబంధు పథ కం, బీమా వంటి పథకాలు రైతుల అభ్యున్నతికి ప్రయోజనం చేకూరుస్తున్నా యని తెలిపారు. ఇంకా మిగిలిన ఉన్న చిన్నచిన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో విూ భూమి – విూ పట్టాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భూ సమస్యలు కలిగి ఉన్న రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతుల భూసమస్యలు పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు ఇటీవల శ్రీకారం చుట్టిన విూ భూమి – విూ పట్టాలు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ఏండ్లు, నెలల తరబడి తహసీల్‌ కార్యాల యం చుట్టూ తిరిగినా, తమ సమస్యలకు పరిష్కారం దొరకలేదని.. ఈ కార్యక్రమంలో వెంటనే పరిష్కరించడం ఆనందంగా ఉందని పాస్‌బుక్‌లు అందుకున్న రైతులు అన్నారు. పాస్‌బుక్‌లు, ఆర్డర్‌ కాపీలు అందుకున్న రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసినట్లయింది. క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి సరిచేయాల్సి ఉం దని తెలిపారు.

Other News

Comments are closed.