మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన : విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

share on facebook
ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  మీర్ పేట్  కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల్లగూడ లో చందనం చెరువు కట్ట మీద జాతిపిత మహాత్మాగాంధీ  విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి   ఆవిష్కరించిన   ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ…స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా15 రోజుల పాటు ఘనంగా సంబరాలు నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాలు ఇచ్చారన్నారు.ఎందరో మహనీయుల ప్రాణత్యాగల ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యము అని మంత్రి పేర్కొన్నారు.
భారత దేశం స్వాతంత్య్రం రాక ముందు,వచ్చిన తర్వాత 75 ఏళ్లలో దేశం ఎలా అభివృద్ధి జరిగిందో,రానున్న కాలానికి దిశ నిర్దేశానికి అవకాశం ఏర్పడిందన్నారు.  తెలంగాణ రాష్టం రాకముందు వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరు గమనించాలని అన్నారు.జాతిపిత మహాత్మాగాంధీ  స్వాతంత్ర్య పోరాట పటిమ భావి తరాలకు తెలిసే విధంగా గాంధీజీ సినిమాను 552 సినిమా హాళ్లలో రోజు రెండున్నర లక్షల మంది చూసే విధంగా ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.చందనం చెరువు కట్ట మీద ఇప్పటికే తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసినట్లు,గాంధీజీ  విగ్రహం అవిష్కరించి ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తి నింపటానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మునిసిపల్ కార్మికులకు బట్టలు,వస్తువులు అందజేసారు.ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్ ,డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి , కార్పోరేటర్ పసునూరి భిక్ష పతి చా రి  కార్పోరేటర్ పసునూరి భిక్ష పట్టించాయి   ,పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి గారు,ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి  ,వర్కింగ్ ప్రెసిడెంట్ భుపేష్ ,మాజి అధ్యక్షురాలు లావణ్య ,కార్పొరేటర్లు,నాయకులు అధికారులు పాల్గొన్నారు.

 

Other News

Comments are closed.