మాంగల్య షాపింగ్ మాల్ ను ప్రారంభించిన టాలీవుడ్ నటి కేథరిన్ త్రెస.

share on facebook

భారీ గా తరలివచ్చిన ప్రజలు.
అలరించిన ఆటాపాటా.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్23 (జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటైన అత్యాధునిక మాంగల్య షాపింగ్ మాల్ ను శుక్రవారం టాలీవుడ్ తారా కేథరిన్ త్రెస ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 బ్రాంచ్ మాంగల్య షాపింగ్ మాల్ ను నాగర్ కర్నూల్ పట్టణంలో ప్రారంభించడం హర్షణీయంగా ఉందని,ఈ ప్రాంత ప్రజలకు వస్త్ర కొనుగోలు కు మాంగల్య షాపింగ్ మాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. శుభకార్యాలకు వివాహది కార్యక్రమాలకు పిల్లల నుండి మొదలుకొని మహిళలు పురుషులకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు షాపింగ్ మాల్ లో వివిధ డిజైన్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా అక్కడికి భారీగా తరలి వచ్చిన ప్రజలు, యువకులను ఆటపాటలతో అలరించారు.ఈ సందర్భంగా షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు పిఎన్ మూర్తి, చైర్మన్ కాసం నమఃశ్శివాయ,డైరెక్టర్లు శివప్రసాద్, అరుణ్ లు మాట్లాడుతూ రిటైల్ షాప్ నుండి నేడు 14వ షాపింగ్ మాల్ ను ఏర్పాటుకు వినియోగదారులు అందించిన సహాయ సహకారాలే కారణమని తెలిపారు.నాగర్ కర్నూల్ లో ఏర్పాటైన అత్యాధునిక మంగళ షాపింగ్ మాల్ జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు.రెడీమేడ్ దుస్తులు పట్టుచీరలు జీరో నుండి వంద సైజు వరకు ఎత్నిక్ వేర్ మరియు హైదరాబాదు లేదా బెంగళూరులో లభించే వన్నీ కూడా ఇక్కడ ఒకే చోట అందుబాటు లో ఉంచబడ్డాయని తెలిపారు.వేడుకలకు సంబంధించిన అన్ని రకాల ఉత్సవాలకు నాణ్యమైన ధరలకు తమ వస్త్రాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 1942 సంవత్సరంలో ఒక రిటైల్డ్ ఫ్యాషన్ స్టోర్ గా ప్రారంభమైన కాసం గ్రూపుకు చెందిన మాంగళ్య షాపింగ్ మాల్ 2019 నాటికి కుటుంబ వ్యాపార అతిపెద్ద టెక్స్ టైల్ కింగ్ డమ్ గా అవతరించిందని అన్నారు. మొత్తం 14 స్టోర్లతో అతిపెద్ద నెట్వర్కింగ్ తో 7000 మందికిపైగా ఉద్యోగులతో పాటు మొత్తం స్టోర్లు మూడు లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయని అన్నారు.తెలంగాణలో మరే ఇతర వస్త్ర షాపింగ్ మాల్స్ అందించని రీతిలో మాంగల్య షాపింగ్ మాల్ తన కస్టమర్ల యొక్క ఫ్యాషన్ ఆకాంక్షలకు మరియు స్టైల్ కు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ అన్నింటికి మించి కస్టమర్ల డబ్బుకు తగిన విలువనిస్తూ అద్భుతమైన కలర్లు మరియు స్టైల్ లలో విస్త్రుత శ్రేణి కి చెందిన డిజైన్లు మరియు కలెక్షన్లను అత్యంత నాణ్యతగా అందించడంలో తమ నిబద్ధతను చాటుకున్నామని అన్నారు. గతంలో శుభకార్యాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లి బట్టలను కొనుగోలు చేసే వారని కానీ నేడు అన్ని రకాల వినియోగ దారులను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల డిజైన్లను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు

Other News

Comments are closed.