రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 993 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,042 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,441కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,150 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,53,715గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,886 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.