షూటింగ్‌తో బిజీ అందుకే రాలేకపోయాను

share on facebook

కోల్‌కతా: దినేశ్‌ కార్తీక్‌ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో క్వాలిఫయర్‌-2కి దూసుకెళ్లింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 25 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా మ్యాచ్‌ ఉంటే ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తప్పకుండా హాజరవుతాడు. కానీ, కోల్‌కతాకు ఎంతో కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు షారుక్‌ హాజరుకాలేదు.

దీనికి కారణం షూటింగ్‌తో బిజీగా ఉండటమే. తన జట్టు విజయం సాధించిందని తెలుసుకున్న వెంటనే షారుక్‌ ఓ వీడియో సందేశాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. షూటింగ్‌ కారణంగా రాలేకపోయానని, క్షమించాలని కోరాడు. అలాగే విజయం సాధించిన తన జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. అందుకే జట్టు సభ్యులతో మాట్లాడలేకపోతున్నాను. షూటింగ్‌ మధ్యలో నా ప్రేమను మీతో పంచుకుంటున్నాను. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని షారుక్‌ పేర్కొన్నాడు. షారుక్‌ భార్య గౌరీ ఖాన్‌ మాత్రం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయాన్ని స్నేహితురాళ్లతో కలిసి ఆస్వాదించింది.

క్వాలిఫయర్‌-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌… సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. శుక్రవారం ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు ఆదివారం ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఢీకొడతారు.

Other News

Comments are closed.