హరితహారం పౌరుల బాధ్యత

share on facebook

అది నిరంతర ప్రక్రియ
అందరూ కలసి నడిస్తేనే ఫలితాలు సాధ్యం: ఇంద్ర
హైదరాబాద్‌,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) : హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి తోడుగా నడవాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రబుత్వంతో కలసి రావాలని అన్నారు. ప్రతి జిల్లాను హరిత జిల్లాగా మార్చాలనీ, ఇందుకు అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని అన్నారు. రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టాలన్నారు. మూడు ఫీట్లకు పైగా ఉన్న మొక్కలను మాత్రమే నాటాలన్నారు. హరితహారం నిరంతర పక్రియ అని చెప్పారు. ప్రతి ప్రభుత్వ సంస్థల్లో వంద శాతం పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలని సూచించారు. అవెన్సూ ప్లాంటేషన్‌ కార్యాచరణ రూపొందించాలనీ, హరితవనాల కోసం స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు. ఏ రకం మొక్కలు ఏయే ప్రదేశాల్లో నాటాలో అటవీ శాఖ అధికారులు సూచనలివ్వాలని, సరైన సమయంలోనే మొక్కలు నాటడం చేపట్టాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌కు పండ్ల మొక్కలను సంబంధిత గ్రామప్రజలతో మాట్లాడి వారి సహాయ సహకారాలతో నాటాలన్నారు. నర్సరీల్లో మొక్కలు సరైన దశలో వృద్ధి చెందిన విూదటే నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
పట్టణాల్లో జంక్షన్లు, రోడ్ల సుందరీకరణకు మొక్కలు నాటాలన్నారు.  అవసరాలకు ఏయే రకం మొక్కలు ఎన్ని కావాలో సర్వే చేసి తదనుగుణంగా నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టామని తెలిపారు. వీటిని
ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ ఏడాది ఎక్కువ హరిత వనాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు, వీలైనన్ని చోట్ల అవెన్యూ ప్లాంటేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పండ్ల మొక్కల్లో అడవి మామిడి పండ్ల మొక్కలు నాటాలని సూచించారు.  గ్రామ సర్పంచ్‌లు, కూలీలను
హరితమిత్ర అవార్డుకు నామినేట్‌ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హరితహారంలో ఈ సంవత్సరం లక్ష్యాన్ని చేరుకునే విధంగా మొక్కలను నాటాలని సోషల్‌ ఫారెస్ట్‌, ఈజీఎస్‌ శాఖల అధికారులు దృఢనిర్చయంతో ముందుకు సాగుతున్నారు. మానవజాతి మనుడగకు చెట్లు సజీవసాక్ష్యం. వృక్షాలు అంతరించడం వల్లనే సరైన వర్షాలు కురువడం లేదని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. గతేడాది వరుణ దేవుడు కరుణించడంతో నాటిన మొక్కలు జీవం పోసుకున్నాయి. ఇందులో భాగంగానే  ఫారెస్ట్‌ నర్సరీలో లక్షల్లో  వివిధ రకాల మొక్కల పెంపకం, అలాగే ఈజీఎస్‌ కింద వివిధ రకాల మొక్కలను పెంచిపోషిస్తున్నారు. వీటిని జులై మాసంలో గ్రామాల వారీగా పంపిణీ చేసి, అందరిచేత మొక్కలు నాటించేందుకు కృషి చేయనున్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయన్న ఆశాభావంతో నాలుగో విడత హరితహారాన్ని ఒక మ¬త్తర ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళాలని సన్నాహాలు చేస్తున్నారు.  మొక్కలు నాటించి ఈజీఎస్‌ కూలీల ద్వారా నాటిన మొక్కల చుట్టూ రక్షణ కంచెలు సైతం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత హరితహారంలో  పాఠశాల, ప్రభుత్వ దవాఖాన, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలకు ప్రతిరోజు నీరుపడుతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో వివిధ శాఖల ఆధ్వర్యంలో పండ్లు, పూలు, అటవీ, మిశ్రమ జాతి మొక్కలతో ఇతర మొక్కల పెంపకాన్ని చేపట్టారు. వన విభాగం కింద ఒకటి, జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం ఆధ్వర్యంలో నర్సరీలను నెలకొల్పి మొక్కల పెంపకం చేపట్టారు.

Other News

Comments are closed.