అంటువ్యాధుల నిర్మూలనకు దశల వారీ చర్యలు

-కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 6: దేశంలో అంటువ్యాధుల నిర్మూలనకు దశల వారీగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ ఐసిసిలో నాలుగు రోజుల పాటు జరిగే అంత ర్జాతీయ అలర్జీ సదస్సును కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే సదస్సులో 90 దేశాల నుండి వైద్య బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ అలర్జీ వ్యాధులపై ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా 63 దేశాల్లో అలర్జీ వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. భారతదేశంలో ఆహారం, స్కిన్‌ అలర్జీలే అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. అలర్జీల వల్ల ప్రజలపై అధిక భారం పడుతుందని ఆయన అన్నారు. అలర్జీలను నిర్మూలించేందుకు గాను ప్రపంచ దేశాలతో కలిసి భారతదేశం కూడా కృషి చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా అంతర్జాతీయ అలర్జీ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. పట్టణీకరణ, వాతావరణ మార్పుల వల్లే ప్రజలు అనేక అంటువ్యాధులకు గురవుతున్నారని అన్నారు. సమయాభావం వల్ల ప్రజలు తీవ్ర ఒత్తిళ్లకు లోనై వివిధ అంటువ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌, బిపి, షుగర్‌ లాంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చా రు. దేశంలోని 100 జిల్లాల్లో బిపి, క్యాన్సర్‌, కార్డియో వాక్సిలర్‌ స్కానింగ్‌లను అందుబా టులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో దాదాపు 10 కోట్ల మంది ఆస్తమాతో బాధప డుతున్నారని, పిల్లల్లో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా రోగ్యంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా భారతదేశానికి చెందిన డాక్టర్లు ప్రపంచ దేశాల్లో వైద్య సేవలు అందజేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగరం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి అందర్జాతీయ వేదిక అయిందని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లువంటిదని ఆయన అన్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సులో అలర్జీకి సంబంధించిన వ్యాధుల నిర్మూలనకు చేపట్టాల్సిన అంశాలపై క్షుణ్ణంగా చర్చించాలని ఆజాద్‌ కోరారు.
అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ వేదిక కావడం సంతో షంగా ఉందని అన్నారు. గత రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన బయో డైవర్‌సిటీ సదస్సు విజయవంతమైందని అన్నారు. అంతర్జా తీయ సదస్సులు జరిగేందుకు హైదరాబాద్‌లో అన్ని వసతులు కల్పించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.