అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి : సోమిరెడ్డి

హైదరాబాద్‌: ప్రజలను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ చర్యలు తీసుకోవాలని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైకాపా, ఎంఐఎం కలిసి రాష్ట్రంలో మతోన్మాదం సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.