అగ్ని ప్రమాదంలో 14మందికి గాయాలు

ముంబాయి: గతశనివారంశ్రీకాకుళం జిల్లా అరిణాం అక్కివలసలోని తమ పురుగుల మందుల తయారీ కర్మాగారంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 14మంది గాయపడ్డారని, వారందరిని ఆసుపత్రికి తరలించామని బాంబే స్టాక్‌ ఎక్సైజ్‌కు నాగార్జున అగ్రికెం లిమిటెడ్‌ తెలియజేసింది. మంటలను అదుపులోకి తెచ్చామని భద్రతాపరమైన చర్యల కోసం కర్మాగారం కార్యకలాపాలను నిలిపివేశామని యాజమాన్యం వెల్లడించింది. ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని, గాపడిన ఉద్యోగుల సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకొనున్నట్లు వివరించింది. నష్టం తీవ్రతను అంచనావేస్తున్నామని, ఎప్పుడు ఉత్పత్తి పున:ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామన్నారు.