అట్లాంటా లో సంగీత, సాహిత్య,నృత్య, ప్రదర్శనలు

అట్లాంటా లో ఘనంగా ముగిసిన 12వ మహసభలు.అమెరికా తెలుగు అసొసియేషన్‌ మహసభల్లో చివరిరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక,సాహిత్య,కళా ప్రదర్శనలు ప్రవాసాంధ్రులను రంజింపజేశాయి.గరికపాటి నరసింహరావు ఆధ్వర్యంలో మూడుగంటలపాటు నిర్వహించిన ఆష్టావదానం అందరినీ ఆకట్టుకుంది. సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ ఎన్‌.లక్ష్మీపార్వతి శారదా శోంఠి,ఓలేటి నరసింహరావు పెమ్మరాజు వేణుగోపాలరావు,డొక్కా ఫణికుమార్‌ తదితరులు పాల్గోని అవధానాన్ని రక్తి కట్టించారు.ముగింపు వేడుకల్లో ప్రముఖ కధానాయిక ఇలియానా ప్రదాన ఆకర్షణగా నిలిచారు. సంగీత దర్శకుడు తమన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అర్థరాత్రి వరకు జరిగిన సంగీత విభావరికి మంచి స్పందన కనిపించింది.జానపద,కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఘమఘుమలాడింది.శోబానాయుడిని ఆమె శిష్యులు సత్కరించారు.ఇప్పటివరకు వివిద సేవా కార్యాక్రమాలకు రూ.25కోట్లు విరాళంగా ఇచ్చిన ప్రవాసాంధ్ర వైద్యుడు లకిరెడ్డి హనిమిరెడ్డిని ఆటా బృందం ప్రత్యేక పురస్కారంతో సత్కరించింది ఆటాకు విచ్చేసిన రాష్ట్ర ప్రతినిదులతో ఓ చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.