అత్యంత శాంతియుతంగా కవాతు నిర్వహించాలి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతి లభించడం ప్రజల విజయమని తెలంగాణ రాజకీయ ఐకాస కీన్వనర్‌ కోదండరాం అన్నారు. అన్ని మార్గాలనుంచి ప్రజలు హైదరాబాద్‌ తరలిరావాలని, మధ్యాహ్నం రెండు గంటలనుంచి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా కవాతు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అత్యంత శాంతియుతంగా కవాతు నిర్వహించాలని, హింస జరుగుతుందని ప్రచారం చేసిన వారికి కవాతు చెంపపెట్టు కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ఆకాంక్షను, ఆత్మాభిమానాన్ని చాటిచెప్పడానికి ఇదో అవకాశమని ఆయన పేర్కొన్నారు.