ఆదర్శ పాఠశాల లో దరఖాస్తుల ఆహ్వానం

గంభీరావుపేట, జూన్ 17 (జనం సాక్షి );రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మనపేట ఆదర్శ పాఠశాలలో ప్రాతిపదికన బోధించుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. పిజిటి ఆంగ్లము, పిజిటి కామర్స్, టీజీటీ ఆంగ్లము ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. టీజీటీ సంబంధిత సబ్జెక్ట్ కు డిగ్రీ ఉత్తీర్ణత మరియు టెట్ క్వాలిఫై వారు అర్హులన్నారు. పిజిటి సంబంధిత సబ్జెక్ట్ లో పీజీ ఉత్తీర్ణత ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి సమాచారంతో సర్టిఫికెట్స్ జిరాక్స్ లు జతచేసి పాఠశాల లో ఇవ్వాల్సిందిగా కోరారు. డెమో తేదీ 19-06-2026రోజున ఉదయం 10 గంటల నుండి జరగనున్నట్లు పేర్కొన్నారు.



