చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ కూలీలతో కొండూరులో వరి నాట్లు

సిరికొండ, జూన్ 17 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో రైతులు వరి నాట్ల పనులను ప్రారంభించారు. స్థానికంగా వ్యవసాయ కూలీల కొరత కారణంగా చత్తీస్‌గఢ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను తీసుకువచ్చి నాట్ల పనులు చేపడుతున్నారు.వ్యవసాయ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రైతులు ఇతర రాష్ట్రాల కూలీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం కూలీల కొరతతో పాటు కూలి రేట్లు కూడా పెరగడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.అయినప్పటికీ సాగు పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు వలస కూలీల సహాయంతో నాట్లు వేస్తున్నారు. కొండూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు రైతులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో వరి నాట్ల పనులు జోరుగా సాగుతున్నాయి.