చెరువులో పడి యువతి మృతి

గంభీరావుపేట జూన్ 17 (జనం సాక్షి ); చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి యువతి మృతి చెందిన విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారెడ్డి పేట గ్రామానికి బంటు జ్యోతి (28) బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులోకి పడిపోవడంతో నీటిలో మునిగిపోయారు.​గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.