తెలంగాణ ఉద్యమ కారుని అంత్యక్రియలో పాల్గొన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే

నిజామాబాద్ ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లె( జనం సాక్షి)
తేదీ: 17-06-2026: కర్సం మోహన్ మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు కర్సం మోహన్ అకాల మరణం పార్టీకి తీరని లోటు మోహన్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ తెలంగాణ ఉద్యమకారుడు కర్సం మోహన్ అకాల మరణం పార్టీకి తీరని లోటని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం గ్రామంలో జరిగిన మోహన్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు వారి నివాసం వద్ద మోహన్ పార్థివదేహం వద్ద పూల మాలను వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.పార్టీలో చురుకుగా ఉండే మోహన్ అకాల మరణం తనను కలచివేసిందన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, నాయకులు బాల్ రాజు, ఉమ్మాజి నరేష్, బోర్గం శ్రీనివాస్, కాస్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.