పానీపూరి తిన్న చిన్నారులు అస్వస్థత..

10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక
రాజన్న సిరిసిల్ల బ్యూరో, జూన్ 17 (జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో ఫుడ్ పాయిజన్ అనుమానిత ఘటన కలకలం రేపింది. పానీపూరి తిన్న అనంతరం 10 మందికి పైగా చిన్నారులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. బాధిత చిన్నారులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.జ్వరంతో ఓ చిన్నారికి ఫిట్స్ వచ్చినట్లు సమాచారం. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పరిశీలిస్తున్నారు. అస్వస్థతకు పానీపూరి కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు.ఈ ఘటనతో తల్లిదండ్రులు, కాలనీ వాసులు ఆందోళనకు గురయ్యారు. కేసీఆర్ నగర్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



