అత్యవసరంగా దిగిన విమానాలు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా రెండు విమానాలను అధికారులు దించివేశారు. దుబాయ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో 12 ఏళ్ల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా దించి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బాలున్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు లండన్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన బ్రిటీష్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించివేశారు. బెంగళూరులో వాతావరణం అనుకూలించపోవడంతో విమానాన్ని శంషాబాద్‌లో దించేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలియజేశారు.