అధికారులకు వసతిగృహ బాధ్యతలు

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌
శ్రీకాకుళం, జూలై 26 : ఎంపీడీవో, తహశిల్దారు, వ్యవసాయాధికారులకు వసతిగృహాల సంరక్షకులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 61 సాంఘిక సంక్షేమ, 80 వెనుకబడిన తరగతుల వసతి గృహాల బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారిని నియమించారు. ఎప్పటి కప్పుడు వసతి గృహాఆలను సందర్శిస్తూ విద్యార్థుల స్థితిగతులు మెరుగు పరచాలని సూచించారు. ఎనిమిది అంశాలతో కూడిన ఆదేశాలిచ్చారు. ప్రతీ గురువారం రాత్రి ఎనిమిది అంశాలపై విద్యార్థులతో మాట్లాడి రాత్రి బస చేయాలని, విద్యాబోధన, హాజరు, భోజనాలను పరిశీలించాలని, ఆరోగ్యపరమైన విషయాలు, వ్యక్తిగత పరిశుభ్రత వంటివి తెలుసుకోవాలని పేర్కొన్నారు.