దేశంలో మోదీ, అమిత్ షాలు ప్రమాదకర శక్తులు

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేశంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు ప్రమాదకర శక్తులుగా మారారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విమర్శించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ముందు భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి కల్పించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ప్రవేశపెట్టగా, పథకాలపై రాజకీయం చేస్తూ, పేరు మార్చడం వారి అవివేకానికి నదర్శనమన్నారు. ఒక స్వాతంత్ర్య సమర యోధుడు అయినటువంటి గాంధీ తాత పేరు తొలగించడం దారుణమన్నారు. ఇలాంటి మతతత్వ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.