యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం
` నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరం
– పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము
టీజీపీఎస్సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించింది : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సామర్థ్యం పెంపు
యూపీఎస్సీ ఛైర్మన్ డా.అజయ్ కుమార్
హైదరాబాద్(జనంసాక్షి):పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్‌పర్సన్ల సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్నారు. 1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందని చెప్పారు. పబ్లిక్? సర్వీస్? కమిషన్ల విషయంలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారని వివరించారు. లక్ష్యాలు సాధించే దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉండాలని సూచించారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్‌పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడారు. భారత వృద్ధిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పారదర్శక ఉద్యోగ భర్తీ విధానాల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశంలోనే అత్యంత నమ్మకమైన సంస్థలుగా నిలుస్తున్నాయని కొనియాడారు. అభ్యర్థుల నిజాయతీ, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జెండర్? సెన్సిటివిటీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ కృషి చేస్తోందని, అలాగే వికసిత భారత్-2047 సాధన కోసం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత సమయంలో భారత్?కు అత్యుత్తమ పబ్లిక్? సర్వెంట్లు అవసరం ఉందని చెప్పారు. అలాంటి వారిని నియమించటంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈ సదస్సు ద్వారా మరింత మెరుగైన విధానాలను అందిపుచ్చుకుంటాయని భావిస్తున్నానని అన్నారు. రాజ్యాంగం, పరిపాలన విభాగంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని యూపీఎస్సీ ఛైర్మన్ డా.అజయ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లను మరింత బలోపేతం చేయటం ప్రధాన లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పబ్లిక సర్వీస్ కమిషన్లపై నమ్మకాన్ని పెంపొందించటం మనందరి బాధ్యత అని సూచించారు. యూపీఎస్సీ ద్వారా ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడిరచారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా రాష్ట్రాల పబ్లిక సర్వీస్ కమిషన్ల సామర్థ్యం పెంపు, నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. లీగల్‌గా సమస్యలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
26వ నేషనల్ కాన్ఫరెన్స్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించటం గర్వంగా ఉందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గతేడాది అన్ని రకాల పరీక్షలను తెలంగాణ పబ్లిక్? సర్వీస్? కమిషన్? దిగ్విజయంగా నిర్వహించిందని కొనియాడారు. సేవా దృక్పథం కలవారిని ప్రతిభ ఆధారంగా, క్యాలెండర్? అనుగుణంగా నియామకాలు చేపట్టాలని సూచించారు. సమయానికి నోటిఫికేషన్లు ఇవ్వటం, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ఇవ్వటం ద్వారా పీఎస్సీల పట్ల ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క, టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం, యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా రాష్ట్రపతి ముర్ముకు యూపీఎస్సీ ఛైర్మన్ సిల్వర్ ఫిలిగ్రీని అందజేశారు. ఈ సిల్వర్ ఫిలిగ్రీని హైదరాబాద్‌కు చెందిన కళాకారులు రూపొందించారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న వివిధ రకాల సవాళ్లపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు, పరస్పర సహకారంపై చర్చ సాగింది.
నో ఫ్లై, నో డ్రోన్ జోన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. నో ఫ్లై, నో డ్రోన్ జోన్‌గా రాచకొండ సీపీ సుధీర్‌బాబు ప్రకటించారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్నారు. దేశంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ద్రౌపదీ ముర్ము.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క ఉన్నారు.యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ అజయ్‌కుమార్, టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తదితరులు సదస్సులో పాల్గొన్నారు. దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించనున్నారు. సదస్సు అనంతరం సాయంత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో వివిధ ప్రదేశాలను ద్రౌపదీ ముర్ము సందర్శించనున్నారు.


