నేడు కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం

` నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ
` ఈ అంశాలే ఎజెండాగా ఉద్యమ కార్యాచరణకు పార్టీ సిద్ధం
` మీడియా సమావేశంలొ వివరాలు వెల్లడిరచనున్న కేసీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. పార్టీ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో నేతలు సమావేశం కానున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో వీటిపై కేసీఆర్‌ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత గులాబీ బాస్‌, మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు, పార్టీ నేతలతో సమావేశాలను కూడా కేసీఆర్‌ అక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రెండేళ్లలో కేసీఆర్‌ ప్రజలకు కనిపించింది చాలా అరుదనే చెప్పుకోవాలి. అయితే తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్‌ రంగంలోకి దిగనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌కు బీఆర్‌ఎస్‌ అధినేత రానున్నారు.కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్‌ సమరశంఖం పూరించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై మాజీ సీఎం దిశానిర్దేశర చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్‌ విూడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలమూరు ` రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో 45 టీఎంసీలకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒప్పుకుందనేది బీఆర్‌ఎస్‌ వాదన. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. రాష్టాంª`ర నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా నోరు మెదపటం లేదని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్‌, బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెడతామని బీఆర్‌ఎస్‌ చెబుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రక్షాళనలపైనా కేసీఆర్‌ దృష్టి సారించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. చాలా రోజుల తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్‌కు రానుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.

ఇక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్‌
` పంచాయితీ ఫలితాలతో కాంగ్రెస్‌కు భయపట్టుకుంది
` ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేది డౌటే
` కేసీఆర్‌ ఫీల్డ్‌లోకి రాకున్న అద్భుత ఫలితాలు
` రైతుల కష్టాలను ప్రపంచానికి కనిపించొద్దనే యూరియా యాప్‌ తెస్తున్నారు
` జీహెచ్‌ఎంసీల్లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదు
` 2028లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం పక్కా
` విూడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ మెంబర్‌ షిప్‌ మొదలవుతుందని కేటీఆర్‌ తెలిపారు. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కు హనీమూన్‌ ముగిసిందని.. ఇక కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తారని వెల్లడిరచారు. కేసీఆర్‌ బహిరంగ సభలపై ఆదివారం సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. రేవంత్‌ రెడ్డి ఎవరితో ఫుట్‌బాల్‌ ఆడుకుంటాడో నాకు తెలియదు.. నేను మాత్రం రేవంత్‌ రెడ్డిని ఫుట్‌బాల్‌ ఆడుకుంటానని అన్నారు. రేవంత్‌ ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, మనువడి గురించి మాట్లాడనని తెలిపారు. రేవంత్‌ రెడ్డి మాదిరి కుటుంబసభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రం విూడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అన్ని విషయాలపై కేసీఆర్‌ రేపు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ మెంబర్‌ షిప్‌ మొదలవుతుందని కేటీఆర్‌ తెలిపారు. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కు హనీమూన్‌ ముగిసిందని.. ఇక కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తారని వెల్లడిరచారు. కేసీఆర్‌ బహిరంగ సభలపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విూడియా అడిగిన ప్రశ్నకు కూడా కేటీఆర్‌ సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులోనే ప్రెస్‌విూట్‌ పెట్టి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామనడం పెద్ద కామెడీ అని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 66 శాతం స్థానాల్లో గెలిచినట్లు రేవంత్‌ రెడ్డి చెబుతున్నది నిజమైతే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పది మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు రావాలని సవాలు విసిరారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నేను ఫెయిల్‌ కాలేదని కేటీఆర్‌ తెలిపారు. తాను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యాకనే 32 జిల్లా పరిషత్‌, 136 మున్సిపాలిటీలను గెలిచామని పేర్కొన్నారు. అదే రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక సొంత పార్లమెంట్‌ స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయాడని విమర్శించారు. తాను ఐరెన్‌ లెగ్‌ కాదని.. రేవంత్‌ రెడ్డి, రాహుల్‌గాంధీలు ఐరన్‌ లెగ్‌లు అని ఎద్దేవా చేశారు. రేవంత్‌ రెడ్డి పాలనకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక అని అన్నారు. పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించదని అన్నారు. మొదట మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. జీహెచ్‌ఎంసీల్లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదని ఆరోపించారు. గ్రేటర్‌ను మూడు కార్పొరేషన్లు చేయాలన్నది రేవంత్‌ రెడ్డి ఆలోచన అని తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ముఖ్యమంత్రికి స్పష్టత లేదని అన్నారు.2028లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం పక్కా అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌ కిట్టీ పార్టీ ఆంటీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫార్ములా ఈ కార్‌ రేస్‌, కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో ఏవిూ లేదని రేవంత్‌ రెడ్డికి అర్థమైందని అన్నారు. రేవంత్‌ రెడ్డి దెబ్బకు పరిశ్రమలు ఆంధ్రాకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. విరూపాక్ష అనే కంపెనీ కర్నూలుకు వెళ్లిపోయిందని తెలిపారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. టైమ్‌ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా ఇవ్వమని చెప్పడానికి రేవంత్‌ రెడ్డి ఎవరని కేటీఆర్‌ ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 50 శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30 శాతం సీట్లు బీసీలకే ఇచ్చామని గుర్తు చేశారు. రేవంత్‌ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకేవిూ లేదని స్పష్టం చేశారు. మార్కెట్‌ యార్డులు బీసీలకు ఇచ్చింది మేమే అని తెలిపారు. రాజకీయం వేరే.. విద్య, ఉపాధిలో బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వరని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.అఖిలేశ్‌ యాదవ్‌ మా పాత దోస్త్‌ అని కేటీఆర్‌ తెలిపారు. అఖిలేశ్‌ను కలిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు బాధ ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్వయంగా అన్నారని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీ దుబే గృహప్రవేశానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు పోయాడో రామచంద్రరావు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఢల్లీిలో రేవంత్‌ రెడ్డి విందులు, వినోదాలు ఎవరి ఇళ్లలో జరుగుతున్నాయో తెలుసని అన్నారు. ఢల్లీి తుగ్లక్‌ రోడ్డులో రేవంత్‌ రెడ్డి ఇల్లు రీమోడల్‌ చేయించిందే బీజేపీ అని తెలిపారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కాంట్రాక్టులు ఇచ్చిందే రేవంత్‌ రెడ్డి అని తెలిపారు. రేవంత్‌ రెడ్డి ఒక కాలు కాంగ్రెస్‌లో.. మరో కాలు బీజేపీలో ఉందనన్నారు. కిషన్‌ రెడ్డితో మాకు అండర్‌ స్టాండిరగ్‌ ఉంటే.. కిషన్‌ రెడ్డి మాకు చేసిందేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
రైతుల కష్టాలను ప్రపంచానికి కనిపించవద్దనే కుట్రతోనే యూరియా యాప్‌ తెస్తున్నారు : కేటీఆర్‌
ఐుఖీ । రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్‌ అప్లికేషన్‌ విధానాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్‌ యాప్‌ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్‌ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ ‘మొబైల్‌ యాప్‌ నాటకాన్ని’ కాంగ్రెస్‌ మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు.కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదని కేటీఆర్‌ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే నేడు రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ‘‘కేసీఆర్‌కు రైతులపై ఉన్నట్లుగా గుండెల్లో ప్రేమ ఉంటే, రైతన్నలకు ఈ సమస్యలు వచ్చేవి కావు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆ ప్రేమ, చిత్తశుద్ధి రెండూ లేవు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా ప్రభుత్వం ‘లైన్లను దాచే’ ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాలని కేటీఆర్‌ హితవు పలికారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులకు సమస్యలు సృష్టించడం మానేసి, చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు.