టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.

ఖమ్మం రూరల్, డిసెంబర్ 19:(జనం సాక్షి )ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హల్లో శనివారం జరిగే టీడబ్యూజేఎఫ్ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు యాస లక్ష్మారెడ్డి, జక్కంపుడి కృష్ణ లు అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ నందు గల సీపీఎం కార్యాలయంలో ‘టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహసభల’ పోస్టర్ ని అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాసభల్లో జర్నలిస్టుల సమస్యల సాధనకై జిల్లా నాయకులు దిశానిర్ధేశం చేయనున్నారని తెలిపారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యేనటువంటి ఇండ్లు, స్థలాలు, అక్రిడేషన్, హెల్త్ కార్డుల తదితర సమస్యల సాధనకై ప్రణాళికలు రచించనున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ అవిష్కరణలో యూనియన్ నాయకులు కామళ్ల వెంకట్, స్వరూప్, రాధక్రిష్ణ, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.



