అనారోగ్యంతో మృతి చెందిన భూషపాక లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం
అనారోగ్యంతో మృతి చెందిన భూషపాక లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం జనం సాక్షి ,(భువనగిరి ఆర్.సీ)న్యూస్ ;భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరానగర్ దళిత కుటుంబానికి చెందిన భూషపాక లక్ష్మీనారాయణ అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందడంతో దహన సంస్కారాల కొరకు 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ 5000/-₹ రూపాయలు ఆర్థిక సాయం చేసి భౌతిక దేహానికి నివాళులర్పించి మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మీనారాయణ అనారోగ్యంతో గత కొద్ది కాలంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది . కుటుంబ సభ్యులు కూలి పనులు చేసి ప్రవేట్ ఆసుపత్రులలో వైద్యం అందించినప్పటికీ కూడా మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నారు .మేము కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చేదోడు వాదోడుగా ఉండి ప్రభుత్వపరంగా ఆదుకోవడం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, వార్డు నాయకులు బట్టు మహేందర్, గాయపాక వెంకటేష్, యాదగిరి , స్వామి, మల్లేష్, నరేష్, ఈశ్వర్, బాబు శ్రీశైలం, తదితరులు పాల్గొనడం జరిగింది.