అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న : టీఆర్ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి షేర్ రమణ్

షేర్ రమణ్  అధ్వర్యంలో 1000మందికి  అన్నదానం
ఎల్బీ నగర్ (జనం సాక్షి  )అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న   టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి షేర్ రమణ్ అన్నారు శుక్రవారం నాడు గణేష్    నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి షేర్  రమణ్ అధ్వర్యంలో  హస్తినాపురంలోని పోచమ్మ అమ్మవారి దేవాలయం ప్రక్కన  1000  మందికి అన్నదానం చేశారు  .ఈ సందర్బంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షేర్ రమణ్ మాట్లాడుతూ గణేష్  నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏటా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం   నిర్వహించడం జరుగుతుందని తెలిపారు  .ఈ కార్యక్రమంలో  నాయకులు తుప్పటి శ్రీకాంత్,షేర్  పరాశరన్ యాదవ్ ,విజయ్ కరెంటు ధీరజ్ నజీర్   శ్రీ సాయి  శాంతి సహాయ సేవా సమితి  అధ్యక్షురాలు  సంపూర్ణ శాంతి గుప్తా  తదితరులు పాల్గొన్నారు  .