అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణే కార్యాచరణ కావాలి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) :

రాష్ట్రంలోని రాజకీయ పార్టీల న్నింటికీ తెలంగాణే కార్యా చరణ కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ కాకుండా వేర్వేరు ఎజెండాలతో ముందుకుసాగే పార్టీలను ఈ ప్రాంతంలో బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.ఈనెల 28లోగా కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌ సీపీ తెలంగాణపై తేల్చాలని కోరారు. లేనిపక్షంలో తామే వేరే ప్రత్యామ్నాయాన్ని తయారు చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలను పార్టీలు గౌరవించి తీరాలని సూచించారు.