యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..
న్యూఢిల్లీ(జనంసాక్షి):అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలో యూపీఎస్సీ ఈసారి కీలక మార్పులు చేసింది. పరీక్షల్లో మోసాన్ని నివారించేందుకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపును తప్పనిసరి చేసింది. ఇప్పటికే పలు సర్వీసులకు ఎంపికైన వారు మళ్లీ పరీక్ష రాయాలనుకుంటే వారి అర్హతలను కఠినతరం చేసింది. దీనికి సంబంధించి గురువారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష దేశవ్యాప్తంగా ఈ ఏడాది మే 24న జరగనుంది.


