బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్..

` మావోయిస్టు నేత ఉదమ్ సింగ్ మతి
చర్ల(జనంసాక్షి):బీజాపూర్ జిల్లా తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్లటూన్`30 కమాండర్ ఉదమ్ సింగ్ మతి చెందినట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం నుంచి భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. డీఆర్‌జీ (డిస్టిక్ రిజర్వ్ గార్డు) సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. పెద్దగెల్లూరు అడవిలో మావోయిస్టులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో బలగాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య కాల్పులు జరిగాయి. అయితే ఘటనాస్థలి నుంచి ఆటోమేటిక్ ఏకే`47 రైఫిల్‌తో పాటు పలు ఆయుధసామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.